Type Here to Get Search Results !

పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేయండి

పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేయండి
జనం న్యూస్ , 1 నవంబర్ , ఇల్లంతకుంట :
మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన బండి సంజయ్ కుమార్ స్థానిక బీజేపీ నేతలను కలిసి కార్యకర్తలతో ముచ్చటించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.....ఎన్నికలకు ముందే రాజకీయాలు ఆ తరువాత అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అందరితో కలిసి పనిచేసేందుకు యత్నిస్తున్నా, గత ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఆలోచించిందో తెలిసిందన్నారు. అభివృద్ధి విషయంలో మేం సహకరిస్తామని తెలిపారు. మూసీ పునరుజ్జీవంపైన సీఎం పాదయాత్ర చేస్తానంటున్నాడు, ఇప్పుడేమో ట్విట్టర్ టిల్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు పార్టీలు ఒక్కటే కదా? 6 గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక మోసం చేసిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ దైతే,  గత 10 ఏళ్ల పాలనలో ప్రజలను అడుగడుగునా మోసం చేసినది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. మీ ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర.’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పిన బండి సంజయ్  ‘ఇద్దరూ కలిసి అటు నుండి ఒకరు ఇటు నుండి ఇంకొకరు పాదయాత్ర చేసుకోండి ఎద్దేవా చేసారు. ఆ తరువాత మీరిద్దరూ కలిసి బహిరంగ సభ పెట్టుకుని రాహుల్ గాంధీ, కేసీఆర్ లను పిలుచుకోండి’’అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే 6 గ్యారంటీలపై పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చూస్తున్నారన్నారు. 6 గ్యారంటీల పేరుతో ఓట్లేయించుకుని నిలువునా మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలిస్తామని, ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్ లో ఉన్నా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా కాలేజీలు మూసివేసే పరిస్థితి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ జిల్లా అధ్యక్షులు గంగిడి మోహన్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజి రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, మండల కన్వీనర్ దేశెట్టి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్, నాయకులు బత్తిని స్వామి, కొలనూర్ ముత్తాక్కా, మధుసూదన్ రెడ్డి, ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, మ్యాకల మల్లేష్, పున్ని సంపత్, తిప్పరపు శ్రవణ్, భూమల్ల అనిల్, మామిడి హరీష్, అమ్ముల అశోక్ మరియు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.